పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
యలమంచిలి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వలన నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటు తున్నాయని ధరల పెరుగుదల వలన సామాన్య ప్రజల జీవనం అగమ్యగోచరంగా మారిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు పి మాణిక్యం, సిహెచ్ మంగతాయారు అన్నారు. సోమవారం యలమంచిలి పట్నంలో గల మార్కెట్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరలు పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఐద్వా నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటీవల పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుదల ప్రభావం వలన అన్ని నిత్యవసర సరుకులు ధరలు దాదాపు 50% పైగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల యొక్క ఆదాయాలు పెరగడం లేదని ఫలితంగా మధ్య తరగతి సామాన్య, పేద ప్రజల యొక్క బ్రతుకులు తీవ్ర ఇబ్బందులకు నెట్టి వేయబడ్డాయని తెలిపారు. తక్షణమే నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అవసరమైన 14 రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ శక్తులకు ఆహార పంటలపై హక్కులు కల్పిస్తున్నారని పెద్ద పెద్ద వ్యాపారస్తులు, దళారులు నిత్యవసర సరుకులను బ్లాక్ మార్కెట్లకు తరలించి ధరలు పెరుగుదలకు పాల్పడు తున్నారని విమర్శించారు. ధరలు పెరుగుదలను అరికట్టక పోతే రాష్ట్రావ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్యులు ఈశ్వరమ్మ, సత్యవతి, ఆశ లక్ష్మీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


