గూడూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి 28వ విడత చెక్కుల పంపిణీ జరిగింది. దాదాపు ₹32 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు CMRF భరోసాగా నిలుస్తోందన్నారు. అర్హులైన బాధితులకు సహాయం అందేలా స్థానిక నాయకులు చొరవ చూపాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


Uploaded Video:


