రామచంద్రాపురం సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి
రామచంద్రాపురం మండలం రాయలచెరువులోని శ్రీ శక్తి పీఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీ కాళికాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
శ్రీ శక్తి పీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి, శక్తి గురు శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతీ మహాస్వామిని వారి పర్యవేక్షణలో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మోహినీ అలంకరణలో శ్రీకృష్ణ పరమాత్మ భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రత్యేక అలంకరణలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
సాయంత్రం సాంప్రదాయబద్ధంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీకృష్ణ మరియు గోపికల వస్త్రధారణలో వచ్చిన చిన్నారులకు పూజ్యశ్రీ మాతాజీ వారు ప్రత్యేక కానుకలు అందజేసి ఆశీర్వదించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు.
పీఠంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాల్లో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు.
భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంప్రదాయాలతో వేడుకలు వైభవంగా జరిగాయి.



