నంద్యాల : ప్రభుత్వ భూములు, గ్రామకంఠం, పోరంబోకు స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్లపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. విధుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన వీఆర్‌ఓ మల్లారెడ్డిని సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్యాపిలి మండలం మాధవరం గ్రామంలోని సర్వే నంబర్ 507లోని ప్రభుత్వ పోరంబోకు భూమిని ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా ఇతరుల పేర్లకు మార్చినట్లు వచ్చిన ఫిర్యాదుపై జేసీ విచారణ చేపట్టారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో, ప్రస్తుతం డోన్-1 క్లస్టర్ వీఆర్‌ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్లారెడ్డిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని జేసీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తే సహించేది లేదు: వీఆర్‌ఓను సస్పెండ్ చేసిన జేసీ సూరజ్ ధనుంజయ్