నంద్యాల:మధుమణి ఆసుపత్రి ఆడిటోరియంలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ జోనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, కార్యదర్శి ఫయాజ్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఇటీవల అమరావతి క్రీడా పోటీల్లో నంద్యాల ప్లేయర్లు ఒక స్వర్ణం, 4 రజతాలు సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం అభినందనీయమని రవి కృష్ణ అన్నారు. త్వరలోనే నంద్యాలలో రాష్ట్రస్థాయి పోటీలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పోటీల్లో కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల నుంచి 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కోచ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నంద్యాలలో ఘనంగా ఇంటర్ జోనల్ బాక్సింగ్ పోటీలు ప్రారంభం