అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 4 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
రేవు పోలవరం జడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు సీనియర్ క్రికెట్ టీం ముందుకు వచ్చి స్పోర్ట్స్ కిట్‌ను విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా పాఠశాలలో చిన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తమవంతు సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. పాఠశాలకు స్పోర్ట్స్ కిట్ అందించిన క్రికెట్ టీం సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అందించిన క్రీడా సామగ్రిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో క్రికెట్ టీం సభ్యులు కారే అమ్మోరయ్య, చోడిపల్లి లోవరాజు, సింహాచలం, బొడ్డు ధనరాజు, గనగళ్ల బంగారు రాజు, గనగల నాగరాజుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలలకు క్రీడా సామగ్రి, విద్యా సామగ్రి అందించేందుకు దాతలు ముందుకు రావాలని పాఠశాల సిబ్బంది కోరారు. సమాజంలోని దాతలు, యువత, సేవా సంస్థలు ఇలాంటి పాఠశాలలకు అండగా నిలిస్తే మరెంతో మంది విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.

విద్యార్థుల క్రీడా కలలకు రెక్కలు.. రేవు పోలవరం జడ్పీహెచ్ స్కూల్‌కు సీనియర్ క్రికెట్ టీం చేయూత.
అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 4 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): రేవు పోలవరం జడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు సీనియర్ క్రికెట్ టీం ముందుకు వచ్చి స్పోర్ట్స్ కిట్‌ను విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా పాఠశాలలో చిన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తమవంతు సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. పాఠశాలకు స్పోర్ట్స్ కిట్ అందించిన క్రికెట్ టీం సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అందించిన క్రీడా సామగ్రిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టీం సభ్యులు కారే అమ్మోరయ్య, చోడిపల్లి లోవరాజు, సింహాచలం, బొడ్డు ధనరాజు, గనగళ్ల బంగారు రాజు, గనగల నాగరాజుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలలకు క్రీడా సామగ్రి, విద్యా సామగ్రి అందించేందుకు దాతలు ముందుకు రావాలని పాఠశాల సిబ్బంది కోరారు. సమాజంలోని దాతలు, యువత, సేవా సంస్థలు ఇలాంటి పాఠశాలలకు అండగా నిలిస్తే మరెంతో మంది విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.

