ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 3 ( పున్నమి ప్రకృతి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం, అభిమానంతోనే పార్టీలో చేరుతున్నారని కాకాణి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా వైసీపీలో చేరుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి సర్వేపల్లిలో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని కాకాణి ఆశాభావం వ్యక్తం చేశారు.

కాకాణి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన 30 కుటుంబాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 3 ( పున్నమి ప్రకృతి) నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం, అభిమానంతోనే పార్టీలో చేరుతున్నారని కాకాణి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా వైసీపీలో చేరుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి సర్వేపల్లిలో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని కాకాణి ఆశాభావం వ్యక్తం చేశారు.

