మంథని, సెప్టెంబర్ 02:
మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో పత్తి పంటలో అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై బుధవారం పద్దతి ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు అంజని మిశ్రా మాట్లాడుతూ పత్తి పంటలో అంతరపంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, నేల వనరుల సమర్థ వినియోగం, పంటల వైవిధ్యం, చీడపీడల ఉధృతిని తగ్గించడంలో అంతరపంటల పాత్ర గురించి రైతులకు వివరించారు. మండల వ్యవసాయ అధికారి డా. నవ్య మాట్లాడుతూ పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ప్రాధాన్యతను వివరించారు. పంటను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తించడం, పసుపు జిగురు అట్టలు, ఫెరోమోన్ ట్రాప్స్ వంటి పద్ధతులను వినియోగించడం, జీవ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా పురుగుల ఉధృతిని నియంత్రించవచ్చని తెలిపారు. అవసరమైనప్పుడు మాత్రమే సిఫార్సు చేసిన పురుగు మందులను సరైన మోతాదులో వినియోగించాలని రైతులకు సూచించారు. కేవీకే శాస్త్రవేత్త వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారులతో కలిసి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పత్తి పంటలో చీడపీడల నివారణ, అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన పొందారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా పత్తి పంటలో దిగుబడి పెంచడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని అధికారులు సూచించారు.

పత్తి పంటలో అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణపై రైతులకు అవగాహన
మంథని, సెప్టెంబర్ 02: మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో పత్తి పంటలో అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై బుధవారం పద్దతి ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు అంజని మిశ్రా మాట్లాడుతూ పత్తి పంటలో అంతరపంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, నేల వనరుల సమర్థ వినియోగం, పంటల వైవిధ్యం, చీడపీడల ఉధృతిని తగ్గించడంలో అంతరపంటల పాత్ర గురించి రైతులకు వివరించారు. మండల వ్యవసాయ అధికారి డా. నవ్య మాట్లాడుతూ పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ప్రాధాన్యతను వివరించారు. పంటను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తించడం, పసుపు జిగురు అట్టలు, ఫెరోమోన్ ట్రాప్స్ వంటి పద్ధతులను వినియోగించడం, జీవ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా పురుగుల ఉధృతిని నియంత్రించవచ్చని తెలిపారు. అవసరమైనప్పుడు మాత్రమే సిఫార్సు చేసిన పురుగు మందులను సరైన మోతాదులో వినియోగించాలని రైతులకు సూచించారు. కేవీకే శాస్త్రవేత్త వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారులతో కలిసి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పత్తి పంటలో చీడపీడల నివారణ, అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన పొందారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా పత్తి పంటలో దిగుబడి పెంచడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని అధికారులు సూచించారు.

