జనసైనికుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు.. భారీగా పాల్గొన్న గ్రామ ప్రజలు
అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాక గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో కేక్ కట్ చేసి, పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన పార్టీ మరింత ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, అన్నం స్వరజీరావు, రావి చలపతితో పాటు పలువురు జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


