Wednesday, 2 September 2026
  • Home  
  • బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలన
- తూర్పు గోదావరి

బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలన

*గోవిందపురం – మల్లవరం మధ్య కోటి 87 లక్షలతో బ్రిడ్జి పనులు వేగవంతం – క్షేత్రస్థాయిలో పరిశీలించిన జ్యోతుల నెహ్రూ* *కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 2:* జగ్గంపేట మండలం గోవిందపురం శివారు, గోకవరం మండలం మల్లవరం గ్రామాల మధ్య భూపతిపాలెం సమీపంలో కోటి 87 లక్షల రూపాయలతో నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి పనులను జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ఫేజ్ 3 నిధులతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి గత నెలలో శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా పనుల పురోగతిని నెహ్రూ స్వయంగా పరిశీలించి, అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే గోవిందపురం, మల్లవరం గ్రామాల మధ్య రవాణా సౌకర్యం పూర్తిగా మెరుగుపడుతుందని, దశాబ్దాల నాటి ప్రజల కల నెరవేరబోతుందని అన్నారు.ఇది ఏజెన్సీకి దగ్గర ప్రాంతం కావడంతో అత్యధిక వరద ఉధృతిని సైతం తట్టుకునే విధంగా అత్యంత పటిష్టంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని తెలిపారు.గ్రామీణ రహదారుల అభివృద్ధికి, పల్లెల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, వారి సహకారంతోనే కేంద్ర నిధులు సాధించి ఈ బ్రిడ్జిని మంజూరు చేయించడం జరిగిందని అన్నారు.గత ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతులను పూర్తిగా నిర్వీర్యం చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి పల్లెకు తారు రోడ్డు, ప్రతి పంట పొలానికి కనెక్టివిటీ ఉండాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నామని అన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని, నిర్ణీత గడువులోగా బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాలచర్ల నాగేంద్ర చౌదరి, రాయి సాయి, కమ్మిల వెంకటేశ్వరరావు, నాని రాజు కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

*గోవిందపురం – మల్లవరం మధ్య కోటి 87 లక్షలతో బ్రిడ్జి పనులు వేగవంతం – క్షేత్రస్థాయిలో పరిశీలించిన జ్యోతుల నెహ్రూ*

*కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 2:*

జగ్గంపేట మండలం గోవిందపురం శివారు, గోకవరం మండలం మల్లవరం గ్రామాల మధ్య భూపతిపాలెం సమీపంలో కోటి 87 లక్షల రూపాయలతో నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి పనులను జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ఫేజ్ 3 నిధులతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి గత నెలలో శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా పనుల పురోగతిని నెహ్రూ స్వయంగా పరిశీలించి, అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ..
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే గోవిందపురం, మల్లవరం గ్రామాల మధ్య రవాణా సౌకర్యం పూర్తిగా మెరుగుపడుతుందని, దశాబ్దాల నాటి ప్రజల కల నెరవేరబోతుందని అన్నారు.ఇది ఏజెన్సీకి దగ్గర ప్రాంతం కావడంతో అత్యధిక వరద ఉధృతిని సైతం తట్టుకునే విధంగా అత్యంత పటిష్టంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని తెలిపారు.గ్రామీణ రహదారుల అభివృద్ధికి, పల్లెల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, వారి సహకారంతోనే కేంద్ర నిధులు సాధించి ఈ బ్రిడ్జిని మంజూరు చేయించడం జరిగిందని అన్నారు.గత ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతులను పూర్తిగా నిర్వీర్యం చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి పల్లెకు తారు రోడ్డు, ప్రతి పంట పొలానికి కనెక్టివిటీ ఉండాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నామని అన్నారు.
నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని, నిర్ణీత గడువులోగా బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాలచర్ల నాగేంద్ర చౌదరి, రాయి సాయి, కమ్మిల వెంకటేశ్వరరావు, నాని రాజు కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.