తిరుమలాయపాలెం మండల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ఎస్సై కూచుపూడి జగదీష్
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 2: పెండింగ్‌లో ఉన్న కేసులు, వివాదాలను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఈ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తిరుమలాయపాలెం పోలీస్ శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 12, 2026న మూడో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీకి అవకాశం ఉన్న కేసుల్లోని ఇరుపక్షాలు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సివిల్, కుటుంబ, ఆస్తి, భూ వివాదాలు, కార్మిక వివాదాలు, రాజీపడదగిన క్రిమినల్ కేసులతో పాటు కోర్టులో పెండింగ్‌లో ఉన్న మరియు కోర్టుకు వెళ్లకముందే పరిష్కరించగల వివాదాలను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో కేసులను సామరస్యపూర్వకంగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది.
తమ సమస్యలు, కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనుకునే ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తిరుమలాయపాలెం ఎస్సై కూచుపూడి జగదీష్ కోరారు. మరిన్ని వివరాల కోసం తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.


