*ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు…*
*హరికృష్ణ జయంతి సందర్భంగా నివాళులర్పించిన…టిడిపి శ్రేణులు…*
*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లోని నారాయణ థియేటర్ వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ ఆధ్వర్యంలో అభిమానుల కోలాహలం మధ్య భారీ కేక్ కటింగ్ నిర్వహించి, పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..*
*అనంతరం మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి కార్యాలయం నందు నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు….*
*ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు,కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, తెలుగు యువత, అధిక సంఖ్యలో పాల్గొన్నారు…*



