Thursday, 3 September 2026
  • Home  
  • రాజీకి అవకాశం ఉన్న కేసులను గరిష్టంగా పరిష్కరించాలి: డాక్టర్ జి.వి. మహేష్‌నాథ్
- ఖమ్మం

రాజీకి అవకాశం ఉన్న కేసులను గరిష్టంగా పరిష్కరించాలి: డాక్టర్ జి.వి. మహేష్‌నాథ్

సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసి, రాజీకి అవకాశం ఉన్న కేసులను గరిష్టంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్ డాక్టర్ జి.వి. మహేష్‌నాథ్ సూచించారు. మంగళవారం ఖమ్మం యూనిట్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించదగిన కేసులను ముందుగానే గుర్తించి, సంబంధిత కక్షిదారులకు సమాచారం అందించాలని తెలిపారు. కేసుల పరిష్కారంలో పోలీస్ అధికారులు, న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా లోక్ అదాలత్‌పై విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రాజీ ద్వారా ఇరుపక్షాలకు ప్రయోజనం కలిగే కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.