Tuesday, 1 September 2026
  • Home  
  • ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, చంద్రబాబు చేపట్టిన జలహారతి కి సంఘీభావం
- తూర్పు గోదావరి

ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, చంద్రబాబు చేపట్టిన జలహారతి కి సంఘీభావం

*చంద్రబాబు చేపట్టిన జలహారతికి సంఘీభావంగా మురారి నుండి సోమవరం వరకు వందల ట్రాక్టర్లతో రైతుల భారీ ర్యాలీ – ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* *కాకినాడ , జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 1:* ఉత్తరాంధ్ర రైతుల దాహార్తిని తీర్చేందుకు గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వరకు తరలించేందుకు సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరగనున్న జలహారతికి సంఘీభావంగా కాకినాడ జిల్లాలో రైతులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.పోలవరం ఎడమ కాలువ ఆయకట్టు రైతులు గండేపల్లి మండలం మురారి గ్రామం నుండి కిర్లంపూడి మండలం సోమవరం గ్రామం వరకు వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులతో కలిసి మురారి నుండి సోమవరం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీకి ఘన స్వాగతం పలికారు.అనంతరం సోమవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ ఎల్ నినో ప్రభావంతో రాబోయే రెండేళ్లు తీవ్ర కరువు పరిస్థితులు ఉంటాయని ముందే పసిగట్టిన విజనరీ నాయకుడు చంద్రబాబు అని అన్నారు. కరువును ముందే గ్రహించి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతోనే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా పాయకరావుపేట వరకు తీసుకెళ్లే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. చంద్రబాబు కష్టాన్ని కూడా అవకాశంగా మార్చే నాయకుడు అని, ఆయన ముందుచూపు వల్లే రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి కొరత లేకుండా చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పోలవరం పూర్తయితే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు చంద్రబాబు అని అన్నారు.31 సంవత్సరాల క్రితం ఇదే రోజున చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, అదే స్ఫూర్తితో రైతుల సంక్షేమం కోసం ఈ సంఘీభావ ర్యాలీ చేపట్టామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ రైతులు తరఫున చంద్రబాబుకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, బస్వా వీరబాబు, జంపన సీతారామచంద్ర వర్మ, పోతుల మోహన రావు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, కందుల చిట్టిబాబు, జాస్తి వసంత్, పైడిపాల సూరిబాబు, ఉంగరాల రాము, తోట రవి, తోట గాంధీ, కంటిపూడి సత్యనారాయణ, పిల్ల చంటిబాబు, కుంచె రాజా, చదరం చంటిబాబు, జంపన రవి వర్మ, రాష్ట్ర, జిల్లా టీడీపీ నాయకులు, సొసైటీ చైర్మన్లు, క్లస్టర్ ఇంచార్జిలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

*చంద్రబాబు చేపట్టిన జలహారతికి సంఘీభావంగా మురారి నుండి సోమవరం వరకు వందల ట్రాక్టర్లతో రైతుల భారీ ర్యాలీ – ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*

*కాకినాడ , జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 1:*

ఉత్తరాంధ్ర రైతుల దాహార్తిని తీర్చేందుకు గోదావరి జలాలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వరకు తరలించేందుకు సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జరగనున్న జలహారతికి సంఘీభావంగా కాకినాడ జిల్లాలో రైతులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.పోలవరం ఎడమ కాలువ ఆయకట్టు రైతులు గండేపల్లి మండలం మురారి గ్రామం నుండి కిర్లంపూడి మండలం సోమవరం గ్రామం వరకు వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులతో కలిసి మురారి నుండి సోమవరం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీకి ఘన స్వాగతం పలికారు.అనంతరం సోమవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ ఎల్ నినో ప్రభావంతో రాబోయే రెండేళ్లు తీవ్ర కరువు పరిస్థితులు ఉంటాయని ముందే పసిగట్టిన విజనరీ నాయకుడు చంద్రబాబు అని అన్నారు. కరువును ముందే గ్రహించి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతోనే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా పాయకరావుపేట వరకు తీసుకెళ్లే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.
చంద్రబాబు కష్టాన్ని కూడా అవకాశంగా మార్చే నాయకుడు అని, ఆయన ముందుచూపు వల్లే రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి కొరత లేకుండా చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పోలవరం పూర్తయితే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు చంద్రబాబు అని అన్నారు.31 సంవత్సరాల క్రితం ఇదే రోజున చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, అదే స్ఫూర్తితో రైతుల సంక్షేమం కోసం ఈ సంఘీభావ ర్యాలీ చేపట్టామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ రైతులు తరఫున చంద్రబాబుకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, బస్వా వీరబాబు, జంపన సీతారామచంద్ర వర్మ, పోతుల మోహన రావు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, కందుల చిట్టిబాబు, జాస్తి వసంత్, పైడిపాల సూరిబాబు, ఉంగరాల రాము, తోట రవి, తోట గాంధీ, కంటిపూడి సత్యనారాయణ, పిల్ల చంటిబాబు, కుంచె రాజా, చదరం చంటిబాబు, జంపన రవి వర్మ, రాష్ట్ర, జిల్లా టీడీపీ నాయకులు, సొసైటీ చైర్మన్లు, క్లస్టర్ ఇంచార్జిలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.