Tuesday, 1 September 2026
  • Home  
  • పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో సేవాస్ఫూర్తి ఉచిత కంటి వైద్య శిబిరం మెగా రక్తదాన శిబిరం
- విశాఖపట్నం

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో సేవాస్ఫూర్తి ఉచిత కంటి వైద్య శిబిరం మెగా రక్తదాన శిబిరం

గీతం హాస్పిటల్ సహకారంతో ప్రజలకు వైద్య సేవలు విశాఖపట్నం, మధురవాడ (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 1 : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు సేవా కానుకగా ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రవితేజ రేగులగడ్డ గారు తెలిపారు. గీతం హాస్పిటల్ సహకారంతో నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిపుణులైన వైద్యుల ద్వారా అవసరమైన వైద్య సలహాలు అందించనున్నారు. అదే విధంగా రక్తదాన శిబిరం ద్వారా అత్యవసర సమయంలో అవసరమైన వారికి రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడే గొప్ప సేవ చేయనున్నారు. 8వ వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ ఇన్‌చార్జ్ శ్రీ సఖారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ మరియు భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి డాక్టర్ సందీప్ పంచకర్ల గారి పర్యవేక్షణలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రవితేజ రేగులగడ్డ గారు వెల్లడించారు. సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసేన పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. “జన్మదిన వేడుకలు కాదు.. ప్రజలకు సేవా కానుక!” ఉచిత కంటి వైద్యం • మెగా రక్తదానం • గీతం హాస్పిటల్ సహకారం “ఒక్క యూనిట్ రక్తదానం.. ఒక ప్రాణానికి మరో అవకాశం!”

గీతం హాస్పిటల్ సహకారంతో ప్రజలకు వైద్య సేవలు

విశాఖపట్నం, మధురవాడ (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 1 :

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు సేవా కానుకగా ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రవితేజ రేగులగడ్డ గారు తెలిపారు.

గీతం హాస్పిటల్ సహకారంతో నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిపుణులైన వైద్యుల ద్వారా అవసరమైన వైద్య సలహాలు అందించనున్నారు. అదే విధంగా రక్తదాన శిబిరం ద్వారా అత్యవసర సమయంలో అవసరమైన వారికి రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడే గొప్ప సేవ చేయనున్నారు.

8వ వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ ఇన్‌చార్జ్ శ్రీ సఖారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ మరియు భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి డాక్టర్ సందీప్ పంచకర్ల గారి పర్యవేక్షణలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రవితేజ రేగులగడ్డ గారు వెల్లడించారు.

సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసేన పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.

“జన్మదిన వేడుకలు కాదు.. ప్రజలకు సేవా కానుక!”

ఉచిత కంటి వైద్యం • మెగా రక్తదానం • గీతం హాస్పిటల్ సహకారం

“ఒక్క యూనిట్ రక్తదానం.. ఒక ప్రాణానికి మరో అవకాశం!”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.