– ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, 21 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి
కామారెడ్డి జిల్లాలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ దుర్గా దేవి మండపాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈసారి లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగానే భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.అందులో భాగంగానే, ఉత్సవాల జరిగే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. అలాగే, సీసీ కెమెరాల నిఘాలో ఉత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. భక్తులు సైతం పోలీసులకు సహకరించాలని, అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళా భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకోసం మహిళా పోలీసులను కూడా మోహరించినట్లు ఎస్పీ చెప్పారు. ఈ ఉత్సవాలు సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


