Saturday, 5 September 2026
  • Home  
  • నెల్లూరు లో రాజుకుంటున్న మునిసిపల్ ఎన్నికల వేడి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు లో రాజుకుంటున్న మునిసిపల్ ఎన్నికల వేడి

* రిజర్వేషన్ ఖరారు కాకముందే మొదలైన రివర్స్ గేర్ ఆట * మేయర్ రిజర్వేషన్ పై ఉత్కంఠ * అధికార పార్టీ లో అన్ని వర్గాల నుంచి ఆశా వహులు * అధికార పార్టీ కి తలనొప్పిగా మారనున్న అభ్యర్థి ఖరారు * ప్రతిపక్ష వైసీపీ లో నిరాశ నిస్పృహలు * మునిసిపల్ మంత్రికి సవాల్ కానున్న ఎన్నికలు * రిజర్వేషన్ ను బట్టి అభ్యర్థి నిర్ణయం ఈ ఏడాది చివరలో మునిసిపల్ ఎన్నికలు జరగ నుండగా రాష్ట్రంలోని 4 వ అతి పెద్దది అయిన నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి పై పలువురు ఆశా వహులు కన్నేసి ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించారు . దీనితో జిల్లా కేంద్రం ఐన నెల్లూరు నగరంలో మునిసిపల్ ఎన్నికల వేడి రాజుకుంటుంది . అయితే మేయర్ అభ్యర్థి రిజర్వేషన్ పై ఉత్కంఠత నెలకొని ఉంది . రాజకీయ నాయకులలో ముఖ్యంగా అధికార పార్టీ లో రిజర్వేషన్ ఖరారు కాకముందే రివర్స్ గేర్ ఆట మొదలయింది . అధికార పార్టీ లు అన్ని వర్గాల నుంచి ఆశా వహులు పుట్టుకొస్తున్నారు . మునిసిపల్ మంత్రి ఆలోచనలతో నెల్లూరు నగర మేయర్ పదవిని బీసీ జనరల్ చేసి తన అనుచరుడైన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ కు కట్టబెట్టాలని ప్రయత్నిస్తుండగా మంత్రి ఆలోచనలకూ గండికొట్టే పనిలో అదే పార్టీ నేతలు చాప కింద నీరులా తమ ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలియ వస్తుంది . మేయర్ పదవి బీసీ జనరల్ కానుందని సంకేతాలు రావడం తో టీడీపీ కి చెందిన కొందరు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు వీరిలో జెడ్ శివ ప్రసాద్ , అబ్దుల్ అజీజ్ , ఎన్ భాను శ్రీ లు ఉండగా నెల్లూరు నగర పరిధిలో వేలాది ముస్లిం ఓట్లు ఉన్నాయని కనుక ముస్లింలకె ఈ దఫా మేయర్ పదవిని కేటాయించాలని ఆ వర్గం నేతలు గట్టిగ డిమాండ్ చేస్తున్నారు . ఇప్పటికే ఆ వర్గం వారు ఎం పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని ఎం ఎల్ ఏ కే శ్రీధర్ రెడ్డి ని మంత్రి నారాయణ లను కలసి తమ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడం జరిగింది దీనితో వారు వారికి హామీ ఇచ్చి ఉన్నట్లు తెలియ వస్తుంది . ఇది ఇలా ఉండగా , రొటేషన్ పద్ధతిలో ఈ దఫా ఎస్ సి లకు కేటాయించాలని ఆ వర్గాలు తమ గళాన్ని విప్పాయి . ఎస్ సి లో బలమైన వర్గమైన మాల మహానాడు , ఎం ఆర్ పి ఏస్ లు ఇప్పటికే ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి ఉన్నాయి . నెల్లూరు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటి సారిగా ఓ సి జనరల్ రిజర్వేషన్ అయిందని రెండవ సారి బి సి జనరల్ కు మూడవ సారి ఎస్ టి జనరల్ కు అవకాశం ఇచ్చారని ఈ దఫా అయినా ఎస్ సి లకు మేయర్ రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు . దీనితో మంత్రి చుట్టూ ఆలోచనలు కమ్ముకుంటున్నాయి . నెల్లూరు మేయర్ పదవి రిజర్వేషన్ ను ఏ విధంగా చేయాలో అర్ధం కావడం లేదని భావిస్తున్నారు . ఏ వర్గాన్ని సంతృప్తి పరచాలో ఎవరిని నిరాశ పరచాలో అర్ధం కాక అధికార పార్టీ లో తలలు పట్టుకుంటున్నారు . వీటి అన్నింటిని పక్కన పెట్టి తిరిగి మొదటికొచ్చి ఓ సి జనరల్ చేస్తే మేమున్నాం అంటూ అధికార పార్టీ లో పలువు నేతలు ముందుకి వస్తున్నారు . వీరిలో మంత్రి ప్రధాన అనుచరుడైన వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు . ఆ తర్వాత స్థానాల్లో ముప్పాళ్ల విజేత రెడ్డి , తాళ్ళపాక అనురాధలు సైతం ఈ ఆశ ఊహల్లో ఉన్నారు . రిజర్వేషన్ ఖరారు కాకముందే అధికార పార్టీ లో రివర్స్ గేర్ ఆట మొదలయింది . మరోవైపు మంత్రి నారాయణ నెల్లూరు సిటీ కి ఎం ఎల్ గా ప్రాతినిధ్యం వహిస్తుండగా మేయర్ పదవి రురల్ నియోజక వర్గానికి దక్కాలని మరి కొందరు వాదిస్తున్నారు . ఈ సమీకరణలు చూసే కొద్ది రకరకాల చర్చలు ప్రారంభం అవుతున్నాయి . ఎప్పుడూ లేనంతగా ఈ దఫా మేయర్ అభ్యర్థిత్వం పై ఇన్ని గళాలు ఒక్కసారిగా వినిపించడం వెనుక అదృశ్య శక్తులు ఎవరు అన్న దాని పై కూడా చర్చ జోరుగా జరుగుతుంది . అధికార పార్టీ లోనే అదృశ్య శక్తులు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . మేయర్ అభ్యర్థిత్వ విషయంలో మారుతున్న రాజకీయ మలుపులు మునిసిపల్ మంత్రికి తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి . * ప్రతిపక్ష వైసీపీ లో నైరాశ్యం ఇది ఇలా ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ లో మేయర్ అభ్యర్థిత్వం విషయంలో నైరాశ్యం కనిపిస్తుంది . అసలు మేయర్ అభ్యర్థిత్వం ఏ సామజిక వర్గానికి రిజర్వేషన్ అవుతుందో ఇంత వరకు తెలియక పోవడం తో రిజర్వేషన్ ఖరారు అయితేనే తమ పార్టీ నుంచి అభ్యర్ధులని ఎంపిక చేసుకోవడానికి ఆ పార్టీ సిద్ధం అవుతుంది . బీసీ జనరలా లేక బీసీ మహిళా నా లేక ఓసి నా ఎస్ సి నా ఏదోఒకటి తేలితేనే ఆ పార్టీ ముందుకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి . అయితే అధికార టీడీపీ లో అభ్యర్థిత్వం విషయంలో తలెత్తుతున్న పరిణామాలతో ఏర్పడే బేధాభిప్రాయాలు వైసీపీ కి కలసి వచ్చే అవకాశాలు గా పరిశీలకులు భావిస్తున్నారు . అయితే టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఆశా వహులు సంఖ్య పెరుగుతుండగా వైసీపీ నుంచి పోటీకి పెద్దగా సుముకత చూపడం లేదని తెలియ వస్తుంది . * ఈ దఫా మేయర్ సీట్ పై ఆసక్తి * కార్పొరేటర్ల టిక్కెట్ల పై అనాసక్తి జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగనుండడం తో నెల్లూరు మేయర్ సీట్ కు డిమాండ్ పెరుగుతుంది . అయితే కార్పొరేటర్ లు గా పోటీ చేసేందుకు చాల మంది సుముఖంగా లేరు . కారణం ఈ దఫా ఏర్పడబోయే కౌన్సిల్ లో కార్పొరేటర్ లకు అంత విలువ డిమాండ్ ఏర్పడే అవకాశాలు కనపడడం లేదు . 50 నుంచి 60 లక్షలు పైనే ఖర్చు చేసుకొని కార్పొరేటర్ గా గెలిచినా అంత విలువ ఇవ్వరని వారు భావిస్తున్నారు కారణం ఆయా నియోజకవర్గ పరిధిలో సంబంధిత ఎం ఎల్ ఏ లే చక్రం తిప్పుతారని తాము నామమంత్రంగా మిగులుతామని వారు భావిస్తున్నారు . ఇంత ఖర్చు చేసి కష్టపడి గెలిచినా అందుకు తగ్గ ప్రతిఫలాలు దక్కవని కూడా వారు లెక్కలు వేసుకుంటున్నారు . కేవలం సామాజిక గౌరవం కోసమే ఈ దఫా కార్పొరేటర్ గా నిలబడాలి తప్ప మరేమి ప్రయోజనాలు దక్కవని వారు భావిస్తున్నారు . దీనితో ఈ దఫా కార్పొరేటర్ లాగా పోటీ చేసేందుకు చాల మంది పెద్దగా ఆసక్తి చూపడం లేదు .

* రిజర్వేషన్ ఖరారు కాకముందే మొదలైన రివర్స్ గేర్ ఆట
* మేయర్ రిజర్వేషన్ పై ఉత్కంఠ
* అధికార పార్టీ లో అన్ని వర్గాల నుంచి ఆశా వహులు
* అధికార పార్టీ కి తలనొప్పిగా మారనున్న అభ్యర్థి ఖరారు
* ప్రతిపక్ష వైసీపీ లో నిరాశ నిస్పృహలు
* మునిసిపల్ మంత్రికి సవాల్ కానున్న ఎన్నికలు
* రిజర్వేషన్ ను బట్టి అభ్యర్థి నిర్ణయం
ఈ ఏడాది చివరలో మునిసిపల్ ఎన్నికలు జరగ నుండగా రాష్ట్రంలోని 4 వ అతి పెద్దది అయిన నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి పై పలువురు ఆశా వహులు కన్నేసి ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించారు . దీనితో జిల్లా కేంద్రం ఐన నెల్లూరు నగరంలో మునిసిపల్ ఎన్నికల వేడి రాజుకుంటుంది . అయితే మేయర్ అభ్యర్థి రిజర్వేషన్ పై ఉత్కంఠత నెలకొని ఉంది . రాజకీయ నాయకులలో ముఖ్యంగా అధికార పార్టీ లో రిజర్వేషన్ ఖరారు కాకముందే రివర్స్ గేర్ ఆట మొదలయింది . అధికార పార్టీ లు అన్ని వర్గాల నుంచి ఆశా వహులు పుట్టుకొస్తున్నారు . మునిసిపల్ మంత్రి ఆలోచనలతో నెల్లూరు నగర మేయర్ పదవిని బీసీ జనరల్ చేసి తన అనుచరుడైన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ కు కట్టబెట్టాలని ప్రయత్నిస్తుండగా మంత్రి ఆలోచనలకూ గండికొట్టే పనిలో అదే పార్టీ నేతలు చాప కింద నీరులా తమ ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలియ వస్తుంది . మేయర్ పదవి బీసీ జనరల్ కానుందని సంకేతాలు రావడం తో టీడీపీ కి చెందిన కొందరు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు వీరిలో జెడ్ శివ ప్రసాద్ , అబ్దుల్ అజీజ్ , ఎన్ భాను శ్రీ లు ఉండగా నెల్లూరు నగర పరిధిలో వేలాది ముస్లిం ఓట్లు ఉన్నాయని కనుక ముస్లింలకె ఈ దఫా మేయర్ పదవిని కేటాయించాలని ఆ వర్గం నేతలు గట్టిగ డిమాండ్ చేస్తున్నారు . ఇప్పటికే ఆ వర్గం వారు ఎం పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని ఎం ఎల్ ఏ కే శ్రీధర్ రెడ్డి ని మంత్రి నారాయణ లను కలసి తమ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడం జరిగింది దీనితో వారు వారికి హామీ ఇచ్చి ఉన్నట్లు తెలియ వస్తుంది . ఇది ఇలా ఉండగా , రొటేషన్ పద్ధతిలో ఈ దఫా ఎస్ సి లకు కేటాయించాలని ఆ వర్గాలు తమ గళాన్ని విప్పాయి . ఎస్ సి లో బలమైన వర్గమైన మాల మహానాడు , ఎం ఆర్ పి ఏస్ లు ఇప్పటికే ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి ఉన్నాయి . నెల్లూరు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటి సారిగా ఓ సి జనరల్ రిజర్వేషన్ అయిందని రెండవ సారి బి సి జనరల్ కు మూడవ సారి ఎస్ టి జనరల్ కు అవకాశం ఇచ్చారని ఈ దఫా అయినా ఎస్ సి లకు మేయర్ రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు . దీనితో మంత్రి చుట్టూ ఆలోచనలు కమ్ముకుంటున్నాయి . నెల్లూరు మేయర్ పదవి రిజర్వేషన్ ను ఏ విధంగా చేయాలో అర్ధం కావడం లేదని భావిస్తున్నారు . ఏ వర్గాన్ని సంతృప్తి పరచాలో ఎవరిని నిరాశ పరచాలో అర్ధం కాక అధికార పార్టీ లో తలలు పట్టుకుంటున్నారు . వీటి అన్నింటిని పక్కన పెట్టి తిరిగి మొదటికొచ్చి ఓ సి జనరల్ చేస్తే మేమున్నాం అంటూ అధికార పార్టీ లో పలువు నేతలు ముందుకి వస్తున్నారు . వీరిలో మంత్రి ప్రధాన అనుచరుడైన వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు . ఆ తర్వాత స్థానాల్లో ముప్పాళ్ల విజేత రెడ్డి , తాళ్ళపాక అనురాధలు సైతం ఈ ఆశ ఊహల్లో ఉన్నారు . రిజర్వేషన్ ఖరారు కాకముందే అధికార పార్టీ లో రివర్స్ గేర్ ఆట మొదలయింది . మరోవైపు మంత్రి నారాయణ నెల్లూరు సిటీ కి ఎం ఎల్ గా ప్రాతినిధ్యం వహిస్తుండగా మేయర్ పదవి రురల్ నియోజక వర్గానికి దక్కాలని మరి కొందరు వాదిస్తున్నారు . ఈ సమీకరణలు చూసే కొద్ది రకరకాల చర్చలు ప్రారంభం అవుతున్నాయి . ఎప్పుడూ లేనంతగా ఈ దఫా మేయర్ అభ్యర్థిత్వం పై ఇన్ని గళాలు ఒక్కసారిగా వినిపించడం వెనుక అదృశ్య శక్తులు ఎవరు అన్న దాని పై కూడా చర్చ జోరుగా జరుగుతుంది . అధికార పార్టీ లోనే అదృశ్య శక్తులు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . మేయర్ అభ్యర్థిత్వ విషయంలో మారుతున్న రాజకీయ మలుపులు మునిసిపల్ మంత్రికి తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి .
* ప్రతిపక్ష వైసీపీ లో నైరాశ్యం
ఇది ఇలా ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ లో మేయర్ అభ్యర్థిత్వం విషయంలో నైరాశ్యం కనిపిస్తుంది . అసలు మేయర్ అభ్యర్థిత్వం ఏ సామజిక వర్గానికి రిజర్వేషన్ అవుతుందో ఇంత వరకు తెలియక పోవడం తో రిజర్వేషన్ ఖరారు అయితేనే తమ పార్టీ నుంచి అభ్యర్ధులని ఎంపిక చేసుకోవడానికి ఆ పార్టీ సిద్ధం అవుతుంది . బీసీ జనరలా లేక బీసీ మహిళా నా లేక ఓసి నా ఎస్ సి నా ఏదోఒకటి తేలితేనే ఆ పార్టీ ముందుకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి . అయితే అధికార టీడీపీ లో అభ్యర్థిత్వం విషయంలో తలెత్తుతున్న పరిణామాలతో ఏర్పడే బేధాభిప్రాయాలు వైసీపీ కి కలసి వచ్చే అవకాశాలు గా పరిశీలకులు భావిస్తున్నారు . అయితే టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఆశా వహులు సంఖ్య పెరుగుతుండగా వైసీపీ నుంచి పోటీకి పెద్దగా సుముకత చూపడం లేదని తెలియ వస్తుంది .
* ఈ దఫా మేయర్ సీట్ పై ఆసక్తి
* కార్పొరేటర్ల టిక్కెట్ల పై అనాసక్తి
జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగనుండడం తో నెల్లూరు మేయర్ సీట్ కు
డిమాండ్ పెరుగుతుంది . అయితే కార్పొరేటర్ లు గా పోటీ చేసేందుకు చాల మంది సుముఖంగా లేరు . కారణం ఈ దఫా ఏర్పడబోయే కౌన్సిల్ లో కార్పొరేటర్ లకు అంత విలువ డిమాండ్ ఏర్పడే అవకాశాలు కనపడడం లేదు . 50 నుంచి 60 లక్షలు పైనే ఖర్చు చేసుకొని కార్పొరేటర్ గా గెలిచినా అంత విలువ ఇవ్వరని వారు భావిస్తున్నారు కారణం ఆయా నియోజకవర్గ పరిధిలో సంబంధిత ఎం ఎల్ ఏ లే చక్రం తిప్పుతారని తాము నామమంత్రంగా మిగులుతామని వారు భావిస్తున్నారు . ఇంత ఖర్చు చేసి కష్టపడి గెలిచినా అందుకు తగ్గ ప్రతిఫలాలు దక్కవని కూడా వారు లెక్కలు వేసుకుంటున్నారు . కేవలం సామాజిక గౌరవం కోసమే ఈ దఫా కార్పొరేటర్ గా నిలబడాలి తప్ప మరేమి ప్రయోజనాలు దక్కవని వారు భావిస్తున్నారు . దీనితో ఈ దఫా కార్పొరేటర్ లాగా పోటీ చేసేందుకు చాల మంది పెద్దగా ఆసక్తి చూపడం లేదు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.