Tuesday, 1 September 2026
  • Home  
  • స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టాలి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టాలి

నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు బీసీవై పార్టీ నేతల వినతి నెల్లూరు జిల్లా స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమ గోపాల్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ మాట్లాడుతూ.. స్వర్ణముఖి నదిలో పెద్ద ఎత్తున జేసీబీలతో ఇసుక అక్రమ తవ్వకాలు చేసి, వందలాది టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రకృతి సంపదకు భారీగా నష్టం వాటిల్లుతోందని తెలిపారు. తెలుగు గంగ ద్వారా స్వర్ణముఖి నది పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందాల్సి ఉండగా, ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా నదిలో ఇసుక దిబ్బలు ఏర్పడి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందని బాలాజీ ఆరోపించారు. సకాలంలో సాగునీరు అందక రైతులు పంట దిగుబడిని కోల్పోతున్నారని అన్నారు. కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట ప్రాంతాల్లో స్వర్ణముఖి నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చెరువుల్లోని మట్టిని గ్రామీణ, రైతుల అవసరాలకు వినియోగించుకునే విషయంలో రైతులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయకపోవడం అన్యాయమని అన్నారు. ఇసుక అక్రమ రవాణాతో రైతుల ఆదాయానికి నష్టం కలుగుతోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీసీవై పార్టీ తరఫున కలెక్టర్‌ను కోరినట్లు బాలాజీ తెలిపారు. స్వర్ణముఖి నదిలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఇసుక అక్రమ దోపిడీని అరికట్టి, ప్రకృతి వనరులను పరిరక్షించడంతో పాటు రైతులకు సాగునీరు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని బీసీవై పార్టీ డిమాండ్ చేసింది.

నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు బీసీవై పార్టీ నేతల వినతి
నెల్లూరు జిల్లా స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమ గోపాల్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ మాట్లాడుతూ.. స్వర్ణముఖి నదిలో పెద్ద ఎత్తున జేసీబీలతో ఇసుక అక్రమ తవ్వకాలు చేసి, వందలాది టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రకృతి సంపదకు భారీగా నష్టం వాటిల్లుతోందని తెలిపారు.
తెలుగు గంగ ద్వారా స్వర్ణముఖి నది పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందాల్సి ఉండగా, ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా నదిలో ఇసుక దిబ్బలు ఏర్పడి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందని బాలాజీ ఆరోపించారు. సకాలంలో సాగునీరు అందక రైతులు పంట దిగుబడిని కోల్పోతున్నారని అన్నారు.
కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట ప్రాంతాల్లో స్వర్ణముఖి నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా చెరువుల్లోని మట్టిని గ్రామీణ, రైతుల అవసరాలకు వినియోగించుకునే విషయంలో రైతులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయకపోవడం అన్యాయమని అన్నారు.
ఇసుక అక్రమ రవాణాతో రైతుల ఆదాయానికి నష్టం కలుగుతోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీసీవై పార్టీ తరఫున కలెక్టర్‌ను కోరినట్లు బాలాజీ తెలిపారు.
స్వర్ణముఖి నదిలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఇసుక అక్రమ దోపిడీని అరికట్టి, ప్రకృతి వనరులను పరిరక్షించడంతో పాటు రైతులకు సాగునీరు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని బీసీవై పార్టీ డిమాండ్ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.