నంద్యాల :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమితులైన మౌలానా మహమ్మద్ హుస్సేన్ అహ్మద్.. నంద్యాలలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో (జీవో.ఆర్.టీ.నెం. 107) ప్రకారం నియామక ఉత్తర్వులు అందుకోవడంతో, మంత్రికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు ప్రభుత్వానికి, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన సభ్యుడికి మంత్రి ఫరూక్ శుభాకాంక్షలు తెలుపుతూ.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, వివాదాల పరిష్కారంలో న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ మైనార్టీల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ సుబ్లి, కర్నూల్ గవర్నమెంట్ కాజీ సలాం మౌలానా, పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు

మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వక్ఫ్ ట్రిబ్యునల్ సభ్యులు మౌలానా