అరకులోయ : తిరుపతిలో జరిగిన అమరావతి ఛాంపియన్‌షిప్-2026లో జావెలిన్ త్రోలో తృతీయ స్థానం సాధించిన అరకు వ్యాలీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని టి. జ్యోతికకు అభినందన సభ నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి ఆదేశాల మేరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేశారు. అలాగే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, షాట్‌పుట్, చెస్ పోటీలు నిర్వహించారు.
విజేతలకు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యతో పాటు క్రీడలు సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని ప్రిన్సిపాల్ అన్నారు. కార్యక్రమంలో పీడీ ఎల్. జ్యోతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


