నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ డా. జి. హేమంత్ రెడ్డి, ప్రిన్సిపల్ డా. కె.వి.వి. సుబ్బయ్య, డీన్ ఏ.ఎస్. ప్రగతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్, ఫిజికల్ డైరెక్టర్ వి. విజయకుమారి హాజరయ్యారు.చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సులభంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని, క్రీడలు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమష్టి కృషిని అలవర్చుతాయని వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులు శారీరక దృఢత్వంపై దృష్టి సారించి మొబైల్ వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.మహిళలు, పురుషుల విభాగాల్లో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, షటిల్, క్యారమ్స్, లగోరి, త్రోబాల్ పోటీలలో సాధించిన పాయింట్ల ఆధారంగా బీసీఏ ద్వితీయ సంవత్సరం (BCA 2nd Year) విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్గా నిలిచి డైరెక్టర్ హేమంత్ రెడ్డి చేతుల మీదుగా విజేత ట్రోఫీని అందుకున్నారు.

శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం – బీసీఏ విభాగం ఓవరాల్ ఛాంపియన్