Friday, 4 September 2026
  • Home  
  • నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం
- నంద్యాల

నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం

నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, క్లబ్ అధ్యక్షుడు సందీప్ అధ్యక్షతన జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడారంగంలో విశేష సేవలందించిన చెస్ కోచ్ రామ సుబ్బారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులులకు లయన్స్ క్రీడా పురస్కారాలు అందజేసి సత్కరించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లయన్స్ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ… క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఏకాగ్రత, గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వాన్ని పెంపొందిస్తాయని, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు క్రీడలను ప్రోత్సహించాలని కోరారు.కాగా, వచ్చే నెలలో నంద్యాలలో జరగనున్న రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ బహుమతుల కోసం లయన్స్ క్లబ్ యూత్ బ్యాచ్ రూ.10,000 విరాళం ప్రకటించింది. ఈ వేడుకలో క్లబ్ ప్రతినిధులు మేడా చంద్రశేఖర్, నాగరాజు, జనార్ధన్, కన్నయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.