*కోట ఏవీకేఆర్ పాఠశాల లో స్ఫూర్తి క్రీడ సందడి, ఘనంగా తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు,*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 కోట మండలం,*
నెల్లూరు జిల్లా కోట తెలుగు భాషా వికాసానికి గిడుగు వెంకటరామమూర్తి, భారత క్రీడా రంగానికి మేజర్ ధ్యాన్‌చంద్ చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. కోట పట్టణంలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు రోజుల క్రితం 100, 200, 400, 600, 800 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్ పోటీలు నిర్వహించారు. వాలీబాల్, కబడ్డీ పోటీలతో పాటు విద్యార్థులకు నచ్చిన క్రీడాకారుడిపై వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీలను సబ్‌మెరైన్ ఎస్ఐ శివసౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు అంకయ్య, సుబ్రహ్మణ్యం, కళ్యాణి ప్రసంగిస్తూ గిడుగు వెంకటరామమూర్తి భాషా సేవలను వివరించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు వలి అహ్మద్ క్రీడల ప్రాధాన్యతను వివరించారు. మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా ప్రస్థానాన్ని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి, ఎం.సీనయ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయుడు వలి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.



