ఎన్టీఆర్ జిల్లా మాగల్లు గ్రామం లోని శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రంలో వెలసిన సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి వారి 108 అడుగుల క్షేత్రంలో నూతనంగా నిర్మించినగోశాలకు ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్, నందిగామ ఆధ్వర్యంలో 10 ట్యూబ్‌లైట్ సెట్లు, నాలుగు సీలింగ్ ఫ్యాన్లు విరాళంగా అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ ప్రకాష్ నందిరాజు గోశాల నిర్వాహకులు అంగర రాంబాబుకు వాటిని అందజేశారు. ఈ సామగ్రిని కృష్ణమూర్తి, పోతరాజు లక్ష్మీనరసింహారావు, చింత ప్రసాద్, పిన్నవెల్లి సుజాత, కే. గోపాలకృష్ణమూర్తి, జీ. కృష్ణమూర్తి, నందిరాజు సాయిమణి సౌజన్యంతో సమకూర్చారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాంబాబు మాట్లాడుతూ గోశాలఅభివృద్ధి, స్వామివారి ఉత్సవాల నిర్వహణకు నిరంతరం సహకరిస్తున్న ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 25 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవు తాయని, జూన్ 29న మహా కుంభాభిషేక మహోత్సవం జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానాధీశ్వరులు శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి కరకమలాలతో పుణ్యనదీ జలాల సమక్షంలో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నందిరాజు రాజా హనుమంతరావు, సాయి మణిశర్మ, కల్పన తదితరులు పాల్గొన్నారు.

గోశాలకు విద్యుత్ సామగ్రి విరాళం మాగల్లు వైకుంఠ నారాయణ క్షేత్రంలో ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు