నంద్యాల :రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య పాల్గొన్నారు.
పేదల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల అమలుపై సమీక్షించిన సీఎం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

విజన్ ప్లాన్ అమలుకు సీఎం ఆదేశం
నంద్యాల :రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, నందికొట్కూరు ఎమ్మెల్యే జి. జయసూర్య పాల్గొన్నారు. పేదల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల అమలుపై సమీక్షించిన సీఎం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

