భద్రాద్రి కొత్తగూడెం: మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ అధ్యక్షుడిగా వాసుమల్ల గౌతమ్‌ను తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ నియమించారు. ఈ సందర్భంగా గౌతమ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌తో కలిసి 1,350 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్న గౌతమ్ కష్టపడే తత్వం, సేవా భావాన్ని గుర్తించిన రాష్ట్ర అధ్యక్షుడు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ మాలల ఐక్యత, అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్ర కమిటీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


