మండల కేంద్రంలోని ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయానికి ఎన్నారై జయరామయ్య రూ.20 వేల విలువైన కంప్యూటర్ ప్రింటర్‌ను ఉచితంగా వితరణ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కార్యాలయ కార్యకలాపాలకు అవసరమైన కంప్యూటర్ ప్రింటర్‌ను తన వంతు సహాయంగా అందించినట్లు తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలు లేకపోవడం వల్ల అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రజాప్రతినిధులు, దాతలు, సేవా భావం కలిగిన వారు తమ వంతు సహకారం అందించాలని జయరామయ్య కోరారు. ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన పరికరాలను అందించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడినట్లవుతుందని తెలిపారు.


