బిఆర్ఎస్ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై గట్టి హెచ్చరిక!
జులై 27 ఖమ్మం జిల్లా బ్యూరో పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం :
ఎంపీ శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి గారిపై బిఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న పనికిమాలిన, అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ప్రజలకు చేస్తున్న సేవలను, వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, పనిగట్టుకొని బురదజల్లే ప్రయత్నం చేస్తే ఖమ్మం ప్రజలు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఆపకపోతే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. ఇది మా గట్టి హెచ్చరిక, షేక్.యాసిన్, జిల్లా కోఆర్డినేటర్, టిపిసిసి మీడియా మరియు కమ్యూనికేషన్స్ విభాగం, ఖమ్మం*
అభివృద్ధి ప్రదాత, ప్రజల మనిషి మన ఎంపీ శ్రీ రఘురాం రెడ్డి గారు!
ఖమ్మం పార్లమెంట్ అభివృద్ధి కోసం అనుక్షణం పరితపించే నిరంతర శ్రామికుడు మన ఎంపీ శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి గారు.
గెలిచిన నాటి నుండి తన పరిధిలోని ఏడు నియోజకవర్గాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సేవకే అంకితమయ్యారు.
పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా లక్షలాది రూపాయల చెక్కులను ప్రతి నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉండి, వైద్యం చేయించుకోలేని ఎంతోమంది అభాగ్యులకు తక్షణమే ఎల్ఓసి (LOC) లు మంజూరు చేయించి వారి పాలిట ప్రాణదాతగా నిలుస్తున్నారు.
పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్లాది రూపాయల అభివృద్ధి నిధులను వెచ్చిస్తున్నారు.
మాటలకంటే చేతలే మిన్న అని నమ్మే రామ సహాయం రఘురాం రెడ్డి గారు, ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు.
యువత, రైతులు, మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చడంలో ఆయన చేస్తున్న కృషి అమోఘం.
ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా, ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉంటూ “ప్రజల మనిషి”గా పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తిత్వం ఆయనది.
అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తూ, ఖమ్మం రూపురేఖలు మార్చడానికి ఒక స్పష్టమైన విజన్ తో ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారు.
ఆయన చేస్తున్న నిస్వార్థ సేవలను, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఖమ్మం ప్రజానీకం గర్విస్తోంది.


