అరకువేలి, ఆగస్టు 27: రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 29న అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం గన్నెల పర్యటన సందర్భంగా ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవోలు రద్దు చేయాలని, పీఎం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు పెంచిన లక్ష రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కె. జగన్నాథం, మండల నాయకులు సహదేవ్ పాల్గొన్నారు.

100% రిజర్వేషన్‌పై సీఎం స్పష్టత ఇవ్వాలి : ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్