7,437 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఆసిఫాబాద్ జిల్లాలో 139 పోస్టులు
కొమురంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 12, 2026(పున్నమి ప్రతినిధి ):
రాష్ట్ర ప్రభుత్వం 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 139 పోలీసు పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఉచిత కోచింగ్‌కు అభ్యర్థుల ఎంపిక కోసం ఈ నెల 15వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా వసతి, తరగతులు, ఫిజికల్ ట్రైనింగ్ అందించనున్నట్లు ఎస్పీ వివరించారు.
పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సమీప పోలీస్ స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్పీ నితికా పంత్ కోరారు.


