संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ASIFABAD

TGSRTC యూనియన్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని AITUC ఆరోపణలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
TGSRTC యూనియన్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని AITUC ఆరోపణలు

खबर की मुख्य बातें

  • కుమురం భీం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ, TGSRTC గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో మెదక్, వరంగల్, నల్గొండ, సికింద్రాబాద్ రీజియన్లలో ప్రభుత్వ అనుకూల TWU కూటమికి మూడు రీజియన్లలో గుర్తింపు ఇవ్వడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం, లేబర్ మినిస్టర్…
  • కార్మికుల తీర్పును గౌరవించాలని, TWU కూటమికి ఇచ్చిన గుర్తింపును రద్దు చేసి, రాష్ట్రస్థాయిలో మెజారిటీ సాధించిన TGSRTC ఎంప్లాయీస్ యూనియన్ (AITUC)కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
  • అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి లేబర్ మినిస్టర్‌ను పదవి నుంచి తొలగించాలని కోరారు.

కుమురం భీం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ, TGSRTC గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో మెదక్, వరంగల్, నల్గొండ, సికింద్రాబాద్ రీజియన్లలో ప్రభుత్వ అనుకూల TWU కూటమికి మూడు రీజియన్లలో గుర్తింపు ఇవ్వడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం, లేబర్ మినిస్టర్ హస్తం ఉందని ఆరోపించారు. కార్మికుల తీర్పును గౌరవించాలని, TWU కూటమికి ఇచ్చిన గుర్తింపును రద్దు చేసి, రాష్ట్రస్థాయిలో మెజారిటీ సాధించిన TGSRTC ఎంప్లాయీస్ యూనియన్ (AITUC)కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి లేబర్ మినిస్టర్‌ను పదవి నుంచి తొలగించాలని కోరారు. ఈ నెల 28న లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద వేలాది మంది కార్మికులతో మహాధర్నా, ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ డిపో యూనియన్ అధ్యక్షుడు సీహెచ్. మల్లికార్జున్, కార్యదర్శి ఎల్పుల అశోక్, సహాయ కార్యదర్శి నరేష్, కోశాధికారి జీఎం బాబు, నాయకులు రాజేందర్ సింగ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *