Wednesday, 2 September 2026
  • Home  
  • పెండింగ్ కేసులపై స్పీడ్ పెంచండి: సీపీ సునీల్ దత్
- ఖమ్మం

పెండింగ్ కేసులపై స్పీడ్ పెంచండి: సీపీ సునీల్ దత్

ముదిగొండ /ఖమ్మం ముదిగొండ పోలీస్ స్టేషన్‌ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని ఆయన పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సెక్టర్ అధికారులు, పోలీస్ సిబ్బందితో సీపీ మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ మురళి, ఎస్‌ఐ నరేష్ పాల్గొన్నారు.

ముదిగొండ /ఖమ్మం

ముదిగొండ పోలీస్ స్టేషన్‌ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని ఆయన పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సెక్టర్ అధికారులు, పోలీస్ సిబ్బందితో సీపీ మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ మురళి, ఎస్‌ఐ నరేష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.