అనారోగ్యం బాధపడుతున్న అడ్డగుట్టకు చెందిన గడిపాక రాములు, వారసిగూడకు చెందిన శ్రీశైలం గార్లకు వారి వైద్య చికిత్స నిమిత్తం రూ.2 లక్షల ఎల్.ఓ.సి. మంజూరు పత్రాలను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారితో కలిసి అందజేయడం జరిగింది.
పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
అనంతరం సీతాఫలమండి లోని డా. బి.ఆర్. అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గారితో కలిసి పరిశీలించడం జరిగింది. విగ్రహాల చుట్టూ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.


