Wednesday, 2 September 2026
  • Home  
  • పేదల సొంతింటి కలకు ‘కేంద్ర ప్రభుత్వం ’ బ్రేక్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఖమ్మం

పేదల సొంతింటి కలకు ‘కేంద్ర ప్రభుత్వం ’ బ్రేక్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రజా ప్రభుత్వం వెనక్కి తగ్గదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ను పలుమార్లు కలిసి తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. రెండు వారాల క్రితం తాను ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదన్నారు. ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు చివరి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మార్చి 31 వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం జమ చేస్తామని చెప్పారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా చెల్లిస్తామని, ఫైనల్ బిల్లు రాని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.

పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రజా ప్రభుత్వం వెనక్కి తగ్గదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ను పలుమార్లు కలిసి తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. రెండు వారాల క్రితం తాను ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదన్నారు.

ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులు చివరి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మార్చి 31 వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం జమ చేస్తామని చెప్పారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా చెల్లిస్తామని, ఫైనల్ బిల్లు రాని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.