Thursday, 3 September 2026
  • Home  
  • పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్
- BHADRADRI

పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్

బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం ఆగస్ట్ 26,(పున్నమి ప్రతినిధి) కొత్తగూడెం: పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు ఉచిత సెమీ రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఉచితంగా నాణ్యమైన శిక్షణతో పాటు పరీక్షకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శారీరక దారుఢ్య పరీక్షలకు కూడా అవసరమైన సూచనలు, శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉద్యోగ సాధనకు కష్టపడి చదివి, పోలీస్ శాఖ అందిస్తున్న ఈ ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు కోరారు.

బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం ఆగస్ట్ 26,(పున్నమి ప్రతినిధి)

కొత్తగూడెం: పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు ఉచిత సెమీ రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఉచితంగా నాణ్యమైన శిక్షణతో పాటు పరీక్షకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శారీరక దారుఢ్య పరీక్షలకు కూడా అవసరమైన సూచనలు, శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉద్యోగ సాధనకు కష్టపడి చదివి, పోలీస్ శాఖ అందిస్తున్న ఈ ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.