పాడేరు మండలం గుత్తులపుట్టు పంచాయతీ సంతబయలులో ITDA నిధులతో ఏర్పాటు చేసిన ఆదివాసీ కిరాణా జనరల్ స్టోర్‌ను రాష్ట్ర GCC చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. గిరిజనులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నిత్యావసర సరుకులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గిరిజనుల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధి మెరుగుదలకు ఇటువంటి దుకాణాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో AMC వైస్ చైర్మన్ జ్ఞాన ప్రకాశ్, MPTC కొమ్మ రామ, రాష్ట్ర ST సెల్ కార్యదర్శి సుబ్బారావు, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

పాడేరు: ఆదివాసీ కిరాణా స్టోర్ ప్రారంభించిన జీసీసీ చైర్మన్