రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాళి
నేటి సాంకేతిక విప్లవానికి రాజీవ్‌గాంధీ వేసిన పునాదులే కారణం
ఇబ్రహీంపట్నం: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ దేశానికి అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
దేశంలో యువతకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు సాంకేతిక రంగం అభివృద్ధికి రాజీవ్‌గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆయన తీసుకున్న దూరదృష్టితో కూడిన నిర్ణయాలు, వేసిన పునాదుల ఫలితంగానే నేడు భారతదేశం సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయిలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
దేశ ప్రగతి, ఆధునిక భారత నిర్మాణం కోసం రాజీవ్‌గాంధీ చూపిన మార్గాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు.



