భూపాలపల్లి ఆగస్టు 20:(పున్నమి ప్రతినిధి):రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, భూపాలపల్లి-2 PHC వైద్య బృందం ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలలో 14 సంవత్సరాలు నిండిన బాలికల కోసం HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం బాలికల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఒక కీలక అడుగు.
ఈ సందర్భంగా, డా. కే. స్వాతి, MLHP ఆధ్వర్యంలోని వైద్య బృందం బాలికలకు HPV వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలు, మరియు ముందస్తుగా వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై సమగ్ర అవగాహన కల్పించారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో HPV వ్యాక్సిన్ యొక్క పాత్రను వారు స్పష్టంగా వివరించారు. అనంతరం, అర్హత కలిగిన బాలికలకు HPV టీకాలు అందించబడ్డాయి.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. నాంచారయ్య గారు క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ప్రసంగించారు, దీని ప్రాధాన్యతను చెప్పారు.బాలికల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం సూచించిన ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో శ్రీదేవి, వి. మనన్య మరియు ఆశా వర్కర్ పి. కుమారి కీలక పాత్ర పోషించారు, బాలికలకు అవసరమైన సహకారాన్ని అందించి, టీకా ప్రక్రియను విజవంతంగా పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ డి. నాంచారయ్య, సీనియర్ ఉపాధ్యాయులు జి. శ్రీనివాస్, మరియు 8, 9 తరగతుల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


