ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని అనంతగిరి మండల వ్యవసాయ అధికారి రంగారావు సూచించారు. బీమా నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు. పంట బీమా గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు చెప్పారు. మండలంలోని చిలకలగెడ్డ పంచాయితీ బూడి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున తట్టుకునే పంటలు సాగు చేయాలని సూచించారు.

పంట బీమా నమోదుకు ఈ నెల 31 వరకు గడువు : అనంతగిరి ఏఓ