నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో శానిటేషన్ విభాగంతో వారాంతపు సమీక్ష నిర్వహించారు. అన్ని డివిజన్లలో ఈ-ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని బ్లాక్స్పాట్లను తొలగించి గ్రీన్స్పాట్లుగా మార్చాలని, వ్యాపార సంస్థలను గుర్తించి ట్రేడ్ లైసెన్సులు జారీ చేసి వసూళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిషేధించిన సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, నిషేధిత ప్లాస్టిక్‌ను జప్తు చేసి జరిమానాలు విధించాలని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని, జంక్షన్ల వద్ద చెత్త నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది మస్టర్ సమయానికి హాజరై విధులు నిర్వర్తించేలా అధికారులు పర్యవేక్షించాలని నందన్ అన్నారు. సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్, వెటర్నరీ వైద్యుడు మదన్ మోహన్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

100% చెత్త సేకరణకు వై.ఓ నందన్ ఆదేశం