రాయచోటికి హెచ్ఎన్ఎస్ఎస్ నిధులు
పున్నమి ప్రతినిధి – రాయచోటి: రాయచోటి నియోజకవర్గానికి హెచ్ఎన్ఎస్ఎస్ నిధులు మంజూరు కావడంపై రైతులు, టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సాగునీటి అవసరాలకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు సాగునీటి సమస్యలు మరింతగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

