మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘన సత్కారం
పదవి అంటే అలంకారం కాదు.. బాధ్యత
మత్స్యకారుల సమస్య పరిష్కారాలపై పోరాటం చేయాలి
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
విశాఖపట్నం:
దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అందించిన సహకారానికి రుణపడి ఉంటామని, మత్స్యకారుల అభివృద్ధికి, సమస్య పరిష్కారానికి తన వంతు పోరాటం చేస్తానని విశాఖ జిల్లా మత్స్యకార అధ్యక్షుడు వాసుపల్లి ధనరాజు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశీలమెట్ట కార్యాలయంలో బుధవారం దనరాజు మత్స్యకారులతో కలిసి వాసుపల్లి గణేష్ కుమార్ కు ఘన సత్కారం చేశారు. బాణాసంచా కాల్చి వాసుపల్లికి ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. మత్స్యకారులను గుర్తించి సముచిత స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి, పార్టీ పెద్దలకు, దక్షిణ ప్రజల ఆపద్బాంధవుడు వాసుపల్లి గణేష్ కుమార్ కి రుణపడి ఉంటానని అన్నారు. *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పదవి అంటే అలంకరణ కాదని, మన అధినేత జగన్మోహన్ రెడ్డి మాదిరిగా బాధ్యత ధైర్యం ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రజలకు జవాబుదారితనం ఉండాలన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మత్స్యకారుల అణిచివేతకు కారకుడఅయ్యారన్నారు. అక్షరాస్యత లేని మా మత్స్యకారులను 40 ఏళ్లుగా మోసం చేయడమే కాకుండా, ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా చిత్తు కాగితంలా చూస్తాడని ఆరోపించారు. అంటరానితనాన్ని అరాచకానికి రూపుమాపాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అధికారంలోకి రావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు*. ముఖ్యంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలన్నారు. అనంతరం వాసుపల్లి ధనరాజుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ లింగం శ్రీను, స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ లండ రమణ,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,వార్డ్ ప్రెసిడెంట్ నీలపు సర్వేశ్వరరెడ్డి, గురజరాపు రవి,జిల్లా వాలంటీర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ దూడ అప్పారావు,జిల్లా స్టూడెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్,జిల్లా బీసీ సెల్ కమిటీ దూడ తాతారావు, జిల్లా మత్స్యకార నాయకులు దూడ అచ్చుతా,గంటల డేడు, మెరుగు ఎల్లజీ, సుగాలా నూకరాజు రాజు , వాసుపల్లి నరసింహులు,వార్డ్ మత్స్యకార నాయకులు అంబతి అప్పలరాజు , దాసరి నరసింగ్ రావు , దాసరి ఎల్లయ్య , సూరపతి నరసింగరావు , పిల్లి సత్తిబాబు ,చేపల నూకరాజు, చేపల రాజు,తదితరులు పాల్గొన్నారు.


