Tuesday, 18 August 2026
  • Home  
  • సింహాచలేశుని దర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌
- విశాఖపట్నం

సింహాచలేశుని దర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు బి.ఎల్‌. సంతోష్‌ , రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌, కేంద్ర మంత్రి శ్రీనివాస్‌ వర్మ , ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సింహాచలేశుని దర్శనం అనంతరం నితిన్‌ నబిన్‌ విశాఖపట్నంలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు బి.ఎల్‌. సంతోష్‌ , రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌, కేంద్ర మంత్రి శ్రీనివాస్‌ వర్మ , ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సింహాచలేశుని దర్శనం అనంతరం నితిన్‌ నబిన్‌ విశాఖపట్నంలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.