Tuesday, 18 August 2026
  • Home  
  • ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ ఎంపిక ప్రక్రియలో ఏర్పడిన అనిశ్చితిపై కలెక్టర్ కు వినతిపత్రం*
- వరంగల్

ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ ఎంపిక ప్రక్రియలో ఏర్పడిన అనిశ్చితిపై కలెక్టర్ కు వినతిపత్రం*

వరంగల్ జిల్లా పరిధిలోని మండల MEO కార్యాలయాల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, విధి విధానాల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులకు 03-08-2026న శంభునిపేట హైస్కూల్‌లో ఒకరోజు శిక్షణ కూడా నిర్వహించారు. అయితే అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫోన్ చేసి “రేపటి నుంచి శిక్షణకు రావద్దు, శిక్షణ నిలిపివేశారు” అని సమాచారం ఇచ్చారు. దీనికి గల కారణం తమకు కూడా తెలియదని, ఐదు రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తామని తెలిపారు. కానీ 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కారణం ఏమిటని అధికారులను సంప్రదించినా సరైన సమాధానం లభించడం లేదని ఎంపికైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపిక ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని, శిక్షణను ఎందుకు నిలిపివేశారో వెల్లడించాలని, అభ్యర్థుల భవిష్యత్తుపై అనిశ్చితిని తొలగించాలని కోరుతూ ఎంపికైన అభ్యర్థులు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి, జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు

వరంగల్ జిల్లా పరిధిలోని మండల MEO కార్యాలయాల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, విధి విధానాల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.
ఎంపికైన అభ్యర్థులకు 03-08-2026న శంభునిపేట హైస్కూల్‌లో ఒకరోజు శిక్షణ కూడా నిర్వహించారు. అయితే అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫోన్ చేసి “రేపటి నుంచి శిక్షణకు రావద్దు, శిక్షణ నిలిపివేశారు” అని సమాచారం ఇచ్చారు.
దీనికి గల కారణం తమకు కూడా తెలియదని, ఐదు రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తామని తెలిపారు. కానీ 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కారణం ఏమిటని అధికారులను సంప్రదించినా సరైన సమాధానం లభించడం లేదని ఎంపికైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపిక ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని, శిక్షణను ఎందుకు నిలిపివేశారో వెల్లడించాలని, అభ్యర్థుల భవిష్యత్తుపై అనిశ్చితిని తొలగించాలని కోరుతూ ఎంపికైన అభ్యర్థులు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి, జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.