యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్‌రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు. అనంతరం గ్రామంలోని డైలీ మార్కెట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంట్రకోట చిరంజీవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతంతో దేశభక్తి భావాలను చాటారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. దేశ అభివృద్ధితో పాటు గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత, ప్రజలు దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచులు అన్నం బాబ్జి, కాంట్రకోట చిరంజీవి, భజంత్రీల రాము, అన్నం స్వరాజీరావు, నాగిరెడ్డి అచ్చయ్యనాయుడు, వైస్ ప్రెసిడెంట్ సింహాచలం, గొంతుమూర్తి కొండయ్యనాయుడు, శెన్నాంశెట్టి శ్రీను, భజంత్రీలు శ్రీను, అగ్రహారపు కుమార్‌స్వామి, దారా పోలిశెట్టి, రాయి కృష్ణ, నాయుడు మాస్టర్, వెంకి నాయుడు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ పతాకంతో ఏటికొప్పాకలో స్వాతంత్ర్య వేడుకల సందడి…!
యలమంచిలి, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్‌రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు. అనంతరం గ్రామంలోని డైలీ మార్కెట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంట్రకోట చిరంజీవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతంతో దేశభక్తి భావాలను చాటారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. దేశ అభివృద్ధితో పాటు గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత, ప్రజలు దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు అన్నం బాబ్జి, కాంట్రకోట చిరంజీవి, భజంత్రీల రాము, అన్నం స్వరాజీరావు, నాగిరెడ్డి అచ్చయ్యనాయుడు, వైస్ ప్రెసిడెంట్ సింహాచలం, గొంతుమూర్తి కొండయ్యనాయుడు, శెన్నాంశెట్టి శ్రీను, భజంత్రీలు శ్రీను, అగ్రహారపు కుమార్‌స్వామి, దారా పోలిశెట్టి, రాయి కృష్ణ, నాయుడు మాస్టర్, వెంకి నాయుడు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

