Saturday, 15 August 2026
  • Home  
  • సీఎస్‌ఐ సెంట్రల్ చర్చిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- కడప

సీఎస్‌ఐ సెంట్రల్ చర్చిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సీఎస్‌ఐ సెంట్రల్ చర్చిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పున్నమి ప్రతినిధి – కడప వైఎస్సార్ జిల్లా కడపలోని సీఎస్‌ఐ సెంట్రల్ చర్చి, ఎస్‌పీజీ క్రైస్ట్ చర్చిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాయలసీమ అధ్యక్ష మండలి బిషప్ తండ్రి ది రైట్ రెవరెండ్ పయ్యాల ఐజాక్ వరప్రసాద్ గారు, వారి సతీమణి శ్రీమతి సీడీ భారతి గారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి గారు, డివిజనల్ చైర్మన్ రెవరెండ్ బి. విక్టరీ రాజుబాబు గారు, ట్రై చర్చ్ హాస్పిటల్ ఇన్‌చార్జ్ శాంతి స్వరూప్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, శాంతి, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చర్చి సభ్యులు, మహిళా ఫెలోషిప్ సభ్యులు, యువత పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సీఎస్‌ఐ సెంట్రల్ చర్చిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పున్నమి ప్రతినిధి – కడప

వైఎస్సార్ జిల్లా కడపలోని సీఎస్‌ఐ సెంట్రల్ చర్చి, ఎస్‌పీజీ క్రైస్ట్ చర్చిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

రాయలసీమ అధ్యక్ష మండలి బిషప్ తండ్రి ది రైట్ రెవరెండ్ పయ్యాల ఐజాక్ వరప్రసాద్ గారు, వారి సతీమణి శ్రీమతి సీడీ భారతి గారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి గారు, డివిజనల్ చైర్మన్ రెవరెండ్ బి. విక్టరీ రాజుబాబు గారు, ట్రై చర్చ్ హాస్పిటల్ ఇన్‌చార్జ్ శాంతి స్వరూప్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, శాంతి, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చర్చి సభ్యులు, మహిళా ఫెలోషిప్ సభ్యులు, యువత పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.