*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 13 వాకాడు మండలం,*
ప్రతి ఒక్కరిలో ఉన్న దృష్టిలోపాన్ని అరికట్టడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.
గురువారం వాకాడు మండలం కొండాపురం వడ్డీ పాలెం గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ద్వారా దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు.
కోట వాకాడు చిట్టమూరు మండలాల్లోని కొండాపురం వడ్డీ పాలెం, చిట్టేడు గుణపాడు గ్రామాల్లో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి అవసరమైన దృష్టిలోపం ఉన్న కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినిత్యం కంటి వైద్య శిబిరాలు నిర్వహించి వారికి కంటి అద్దాలు అందజేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్ చేస్తున్నామని ఆ క్రమంలో మూడు గ్రామాల్లో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరాలు దృష్టిలోపం ఉన్న 45 మందికి నేత్ర వైద్య నిపుణులు బి రమేష్ కంటి పరీక్షలు నిర్వహించి వారికి కంటి అద్దాలు అందజేశామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్ఓ ఫౌండేషన్ కార్యదర్శి ఎం విజయలక్ష్మి, అధ్యక్షుల ముప్పవరపు లీలామోహన్ కృష్ణ గ్రామస్తులు దృష్టిలోపం ఉన్నవారు పాల్గొన్నారు.



