ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
ఖమ్మం: సూర్యాపేట–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గల్లా సత్యనారాయణ, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్యా శ్యాంసుందర్ నాయక్, మర్శకుంట్ల స్వర్ణాకర్, పిల్లలమర్రి వెంకట్, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు జాటోత్ మధు నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ హైవే తెలంగాణ అభివృద్ధికి కీలకమైందని, ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పిస్తుందని వారు పేర్కొన్నారు.

