రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసుకునేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే వరుసగా మూడు నెలల రేషన్‌ను ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సివిల్ సప్లై అధికారులకు సంబంధిత ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హులైన రేషన్ కార్డుదారులు నిర్ణీత గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని, అవసరమైతే సమీప రేషన్ దుకాణం లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు.



