🔵 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ కె. హరిత
🟠 విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వార్తలు: జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
🟢 పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ
భారీ వర్షాల సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారే వాగులు, ఓర్రెలు, బావులు, డ్రైనేజీల వద్దకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
🟡 అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
వర్షాల తీవ్రత దృష్ట్యా అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు స్థానిక పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
🔴 ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
📞 కంట్రోల్ రూమ్ నంబర్: 8500844365
అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు.


